'వరుడు కావలెను' నుంచి కొత్త పోస్టర్

13-04-2021 Tue 18:10
  • నాగశౌర్య జోడీగా రీతూ వర్మ
  • దర్శకురాలిగా లక్ష్మీసౌజన్య
  • హిట్ పై నమ్మకంతో హీరో హీరోయిన్లు  
Special Poster From Varudu Kavalenu

ఈ రోజు 'ఉగాది' పండుగ కావడంతో, ఆయా నిర్మాణ సంస్థలు తమ సినిమాల నుంచి ఏదో ఒక అప్ డేట్ ఇవ్వడానికి ప్రయత్నించాయి. కొత్త సంవత్సరం సందర్భంగా కొన్ని సినిమాలు ఈ రోజున పూజా కార్యక్రమాలు జరుపుకున్నాయి. కొన్ని సినిమాల నుంచి ఫస్టులుక్ లు .. మరికొన్ని సినిమాల నుంచి స్పెషల్ లుక్ లు వచ్చాయి. ఇక కొంతమంది టీజర్ లతో సందడి చేశారు. అలాగే  'ఉగాది' పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని, 'వరుడు కావలెను' సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

నాగశౌర్య - రీతూ వర్మ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాకి, లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది. తాజాగా వదిలిన పోస్టర్లో ఏదో విషయంపై అలిగినట్టుగా రీతూ వర్మ కనిపిస్తోంది. ఆమెను ఎలా బుజ్జగించాలనే ఆలోచన చేస్తున్నట్టుగా నాగశౌర్య కనిపిస్తున్నాడు. సరే వాళ్ల గోల వాళ్లది అనేసి ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇద్దరూ మాత్రం మంచిజోడీగా అనిపిస్తున్నారు. ఇటు నాగశౌర్య - అటు రీతూ వర్మ ఇద్దరూ హిట్ కొట్టక చాలాకాలమైంది. మరి ఈ సినిమా వాళ్ల ముచ్చట తీరుస్తుందేమో చూడాలి.