టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించండి: మంద కృష్ణ మాదిగ

13-04-2021 Tue 17:33
  • టీఆర్ఎస్ కు ఎవరూ ఓటు వేయొద్దు
  • దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారు
  • ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చడం లేదు
Dont vote for TRS calls Manda Krishna Madiga

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలెవరూ ఓటు వేయొద్దని అన్నారు. తెలంగాణ వస్తే దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్... ఆ తర్వాత మోసం చేశారని విమర్శించారు. ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఓట్లు అడిగే నైతిక అర్హతను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కోల్పోయాయని అన్నారు. సాగర్ ఎన్నికలో మహాజన సోషలిస్టు పార్టీని గెలిపించాలని కోరారు.