'సర్కారు వారి పాట' రెండో షెడ్యూల్ ప్రారంభం... సెట్స్ పై మహేశ్ బాబు

13-04-2021 Tue 14:26
  • మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్  
  • పరశురాం దర్శకత్వం
  • ఉగాది రోజున రెండో షెడ్యూల్ షురూ
  • కరోనా జాగ్రత్తలతో చిత్రీకరణ
  • ఈ నెలాఖరుకు ముగియనున్న రెండో షెడ్యూల్
Sarkaru Vaari Paata second schedule begins

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు పరశురాం కాంబినేషన్ లో వస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రం రెండో షెడ్యూల్ నేడు ప్రారంభమైంది. ఉగాది రోజున రెండో షెడ్యూల్ షురూ చేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. కరోనా వ్యాప్తి నేపథ్యలో అన్ని జాగ్రత్త చర్యలతో షూటింగ్ జరుపుతున్నట్టు తెలిపింది. ఈ షెడ్యూల్ లో హీరో మహేశ్ బాబు కూడా సెట్స్ పై అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్, మహేశ్ బాబుకు చెందిన జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. ఇంతకుముందు దుబాయ్ లో 'సర్కారు వారి పాట' తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. రెండో షెడ్యూల్ ను ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్న చిత్రబృందం... ఆపై ప్రధాన షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనుంది.