తిరుపతి ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నేతలతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో!

13-04-2021 Tue 13:45
  • ఉగాది వేడుకకు హాజరైన పలువురు టీడీపీ అగ్ర నేతలు
  • పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులు
  • ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చిందన్న చంద్రబాబు
Chandrababu participates in Ugadi function

ఉగాది పర్వదినాన్ని తెలుగు ప్రజలంతా వేడుకగా జరుపుకుంటున్నారు. వివిధ పార్టీల నేతలు కూడా తమ పార్టీ నేతలతో కలిసి వేడుకల్లో పాల్గొంటున్నారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా అక్కడ బస చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతిలోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ శ్రేణులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాయి. ఈ వేడుకకు పార్టీకి చెందిన పలువురు అగ్ర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. చంద్రబాబును ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, 'తిరుపతి ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం నేతలతో కలిసి ఉగాది వేడుకల్లో పాల్గొన్నాను. తెలుగు సంస్కృతిని చాటేలా జరిగిన పంచాంగ శ్రవణం, వేపపచ్చడి సేవనం వంటి కార్యక్రమాలు ఆహ్లాదాన్నిచ్చాయి. తెలుగు ప్రజలందరూ ఆనందారోగ్యాలతో, భోగభాగ్యాలతో తులతూగాలని ఈ సందర్భంగా ఆ వేంకటేశ్వరుని కోరుకున్నాను' అని తెలిపారు.