'ఆయుధమైనా.. అమ్మాయైనా.. సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది' అంటూ ఆచార్య సినిమా పోస్ట‌ర్ విడుద‌ల చేసిన చిరు

13-04-2021 Tue 12:02
  • చిరంజీవి హీరోగా కొర‌టాల శివ రూపొందిస్తున్న‌ ఆచార్య
  • సిద్ధా అనే ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న చెర్రీ
  • ఆయ‌న స‌ర‌స‌న నీలాంబ‌రిగా పూజ హెగ్డే 
sidda look releases

చిరంజీవి హీరోగా ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ రూపొందిస్తున్న‌ ఆచార్య సినిమా నుంచి మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్ తేజ్ కు సంబంధించిన మ‌రో పోస్ట‌ర్ ఉగాది సంద‌ర్భంగా విడుద‌లైంది. ఈ సారి ఇందులో చెర్రీతో పాటు ఆయ‌న‌కు జోడీగా న‌టిస్తోన్న హీరోయిన్ కూడా క‌న‌ప‌డింది.

'ఆయుధమైనా... అమ్మాయి అయినా... సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది. ఆచార్య‌ ఉగాది శుభాకాంక్షలు' అంటూ చిరంజీవి ఈ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమాలో చెర్రీ సిద్ధా అనే ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న స‌ర‌స‌న ఇందులో పూజ హెగ్డే.. 'నీలాంబ‌రి' అనే పాత్ర‌లో న‌టిస్తోంది.

"షడ్రుచుల సమ్మేళనం మా ‘సిద్ధ, నీలాంబరి’ల ప్రేమ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు" అంటూ కొర‌టాల శివ పేర్కొన్నారు. ట్విట్ట‌ర్ లో ఆయ‌న కూడా ఈ పోస్ట‌ర్‌ను షేర్ చేశారు.  

ఇంతకు ముందే రామ్ చరణ్ కు సంబంధించిన ప‌లు పోస్టర్ల‌ను ఆ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సినిమాలో మెడలో రుద్రాక్ష, చెవికి పోగుతో అందులో చెర్రీ క‌న‌ప‌డుతున్నాడు. గ‌తంలో  చిరు, చెర్రీ ఆర్మీ దుస్తుల్లో ఉన్న ఫొటో కూడా విడుద‌లైంది. కాగా,  ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ న‌టిస్తోంది. 'ఆచార్య'‌ను కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.