తాడేపల్లిలో ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్

13-04-2021 Tue 11:57
  • సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు
  • పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులు
  • కార్యక్రమంలో పాల్గొన్న వెల్లంపల్లి, యార్లగడ్డ
CM Jagan participates in Ugadi celebrations

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఉగాది పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రిని వేద పండితులు సత్కరించి, ఉగాది పచ్చడిని అందించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు, రాష్ట్ర ప్రజలకు జగన్ ఒక ప్రకటన ద్వారా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్లవ నామ సంవత్సరంలో ప్రతి ఇంటా ఆనందాలు, సిరులు నిండాలని ఆయన మనస్పూర్తిగా ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుకుంటున్నానని తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలని కోరారు. కరోనా పీడ శాశ్వతంగా తొలగిపోవాలని ఆకాంక్షించారు.