ప్రభాస్ కోసం రెడీ అవుతున్న భారీ సెట్లు!

13-04-2021 Tue 11:41
  • ప్రభాస్ నుంచి వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు
  • సెట్స్ పై 'ఆది పురుష్' .. 'సలార్'
  • స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో నాగ్ అశ్విన్  
Biggest sets in prabhas movie

ప్రభాస్ హీరోగా రూపొందిన 'రాధేశ్యామ్' కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక ఒక వైపున పౌరాణిక చిత్రంగా రూపొందుతున్న 'ఆది పురుష్' .. మరో వైపున యాక్షన్ మూవీగా నిర్మితమవుతున్న 'సలార్' సెట్స్ పై ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాల తరువాత ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. ఈ సినిమాకి సంబంధించిన పనులు ఎంతవరకూ వచ్చాయనేది అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ విషయాలను తెలుసుకోవడానికి వాళ్లంతా ఆత్రుతను చూపుతున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకునే పనిలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నాడట. స్క్రిప్ట్ కి సంబంధించిన పనులు చివరిదశకు వచ్చాయని అంటున్నారు. త్వరలోనే ఆయన పెర్ఫెక్ట్  స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉంటాడని అంటున్నారు. అలాగే కథ ప్రకారం, ఈ సినిమాకి భారీ సెట్లు అవసరం. ఆ సెట్లను వేయించే పనులు కూడా ముగింపుదశకి చేరుకున్నాయని చెబుతున్నారు. దీపికా పదుకొణే కథానాయిక పాత్రను పోషించనున్న ఈ సినిమాలో, అమితాబ్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.