హైటెక్ సిటీ ప్రాంతంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు!
- మాదాపూర్ లోని ఓ హోటల్ లో పోలీసుల తనిఖీలు
- ఐదుగురు వ్యభిచారిణులు, ఒక విటుడు అరెస్ట్
- రూ. 20 వేల నగదు స్వాధీనం
మాదాపూర్ లోని ఓ హోటల్ లో తనిఖీలను నిర్వహించిన పోలీసులు... వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులతో పాటు, విదేశాలకు చెందిన మరో ముగ్గురు మహిళలను, ఒక విటుడిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 20 వేల నగదును, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.