Krishna District: విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ఉపాధ్యాయిని

Teacher died while teaching to students
  • 8వ తరగతి విద్యార్థులకు క్లాస్ తీసుకున్న శ్రీదేవి  
  • గుండెపోటుతోనే మరణించిందన్న వైద్యులు
  • కృష్ణా జిల్లా చినపారుపూడి స్కూల్‌లో ఘటన
తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉపాధ్యాయిని మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా చినపారుపూడిలో జరిగింది. ఇక్కడి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో నిన్న ఉదయం ఉపాధ్యాయురాలు శ్రీదేవి (54) 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన ప్రధానోపాధ్యాయుడు మోహన్‌రావు, ఇతర ఉపాధ్యాయులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు నిర్ధారించారు.
Krishna District
Teacher
Heart Attack
China Parupudi

More Telugu News