పులివెందులలో వివేకా ఇంటిని మరోసారి పరిశీలించిన సీబీఐ అధికారులు

12-04-2021 Mon 19:09
  • వివేకా హత్య కేసులో తేలని నిందితులు  
  • కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
  • ఇటీవలే వివేకా కుమార్తె ప్రెస్ మీట్
  • పులివెందుల చేరుకున్న సీబీఐ బృందం
  • 3 గంటల పాటు వివేకా ఇంటి పరిశీలన
CBI officials vists Viveka house in Pulivendula

వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా సీబీఐ అధికారులు పులివెందులలోని వివేకా ఇంటిని మరోసారి పరిశీలించారు. హత్య జరిగిన గది, బాత్రూంను క్షుణ్ణంగా శోధించారు. వివేకా ఇంటిని సీబీఐ అధికారులు దాదాపు 3 గంటల పాటు పరిశీలించారు. ఈ సందర్భంగా వివేకా పీఏ హిదయతుల్లాను ప్రశ్నించారు. వివేకా ముఖ్య అనుచరుడు యర్ర గంగిరెడ్డిని కూడా సీబీఐ బృందం నిశితంగా ప్రశ్నించింది.

ఇటీవల వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దోషులెవరో తేల్చాలని కోరారు. ఆమె ప్రెస్ మీట్ పెట్టిన కొన్నిరోజుల్లోనే సీబీఐ అధికారులు పులివెందుల రావడం ఆసక్తి కలిగిస్తోంది.