కేసీఆర్ వయసులో సగం లేనివాళ్లు కూడా పిచ్చికూతలు కూస్తున్నారు: కేటీఆర్

12-04-2021 Mon 17:30
  • వరంగల్ లో కేటీఆర్ మీడియా సమావేశం
  • విపక్షాలకు స్ట్రాంగ్ వార్నింగ్
  • కేసీఆర్ పై వ్యాఖ్యలు చేస్తే బుద్ధి చెబుతామని వ్యాఖ్యలు
  • ఇదే చివరి హెచ్చరిక అని స్పష్టీకరణ
KTR gets angry on opposition leaders

వరంగల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ విపక్ష నేతలపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్ వయసులో సగం వయసు కూడా లేనివాళ్లు పిచ్చికూతలు కూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తే ఇక సహించేది లేదని, తగిన విధంగా బుద్ధి చెబుతామని అన్నారు. ఇదే చివరి హెచ్చరిక అని స్పష్టం చేశారు.

ఉద్యోగాల పేరుతో రాజకీయాలు చేస్తూ కొందరు నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. సునీల్ అనే యువకుడు రెచ్చగొట్టడం వల్లే చనిపోయాడని వెల్లడించారు. కేసీఆర్ పై విమర్శలు చేసే విధంగా సునీల్ కు బ్రెయిన్ వాష్ చేశారని ఆరోపించారు.