కరోనా కేసుల ఎఫెక్ట్.. 1,700 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్

12-04-2021 Mon 15:55
  • కరోనా కేసులు పెరుగుతుండటంతో అమ్మకాలకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 1,707 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 524 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Sensex loses 1707 points amid raise in Corona cases

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. భారత్ లో అమాంతం పెరిగిపోతున్న కరోనా కేసులు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దారుణంగా దెబ్బతీశాయి. దీంతో, మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. తీవ్ర అమ్మకాల ఒత్తిడికి సూచీలు గురి కావడంతో... మార్కెట్లు ఈరోజు ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి వరకు భారీ నష్టాల్లోనే పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,707 పాయింట్లు కోల్పోయి 47,883కి పడిపోయింది. నిఫ్టీ 524 పాయింట్లు నష్టపోయి 14,310కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-8.60%), బజాజ్ ఫైనాన్స్ (-7.39%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-6.87%), టైటాన్ కంపెనీ -(5.24%), ఓఎన్జీసీ (-5.20%).

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (4.83%) మాత్రమే లాభాలను మూటకట్టుకుంది.