West Godavari District: గోదావరిలో స్నానానికి వెళ్లి ఒకరి మృతి.. ఇద్దరి గల్లంతు

One died while going for a bath in Godavari and two are missing
  • పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఘటన
  • గల్లంతైన మిగతా ఇద్దరి కోసం పోలీసుల గాలింపు
  • మృతి చెందిన సత్యనారాయణది చాగల్లు
గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు గల్లంతు కాగా, ఒకరు మరణించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆరుగురు యువకులు నిన్న కొవ్వూరులో సినిమా చూసి సాయంత్రం తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో దారిలో గోదావరి నదిలో స్నానం చేసి వస్తామంటూ వారిలో ముగ్గురు నదిలో దిగారు.

మిగతా ముగ్గురు తినడానికి ఏమైనా తెస్తామని వెళ్లారు. నదిలో దిగిన ముగ్గురు ప్రవాహవేగానికి అదుపు తప్పి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో చాగల్లుకు చెందిన సత్యనారాయణ మృతదేహం గోష్పాద క్షేత్రం వద్ద లభ్యమైంది. మిగతా  ఇద్దరు యువకులు హేమంత్, సోమరాజుల కోసం గాలిస్తున్నారు.
West Godavari District
River Godavari
Missing

More Telugu News