Raviteja: ఆసక్తికరంగా వున్న 'ఖిలాడి' మూవీ టీజర్

Raviteja Khiladi Movie teaser Released
  • రవితేజ తాజా చిత్రంగా 'ఖిలాడి'
  • దర్శకుడిగా రమేశ్ వర్మ
  • మే 28వ తేదీన విడుదల    
రవితేజ కథానాయకుడిగా రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమా రూపొందుతోంది. ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగును జరుపుకుంటోంది. రవితేజకి గల మాస్ ఇమేజ్ ను .. ఆయన బాడీ లాంగ్వేజ్ ను .. ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని తాను ఈ సినిమాను చేస్తున్నట్టుగా రమేశ్ వర్మ చెప్పాడు.

'క్రాక్' తరువాత రవితేజ చేస్తున్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు.

యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా చేసుకుని, అన్ని ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. చివరి వరకూ ఎలాంటి డైలాగ్స్  లేకుండా, రవితేజ లైఫ్ లోని పరిణామాలపై కట్ చేసిన విజువల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. విజువల్స్ కి తగినట్టుగా ఆర్ ఆర్ అదిరిపోయింది.

 హీరో ఎందుకు క్రిమినల్ గా మారాడు? ఎందుకు జైలుకు వెళ్లాడు? అనే ఆసక్తిని ఈ టీజర్ రేకెత్తిస్తోంది. ముఖ్యంగా టీజర్ లాస్ట్ లో రవితేజ 'ఎమోషన్స్ లేనివాడిని ఎవరూ ఆపలేరు' అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. మే 28వ తేదిన విడుదల కానున్న ఈ సినిమాలో, మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతి కథానాయికలుగా అలరించనున్నారు.


Raviteja
Meenakshi Chaudary
Dimple Hayathi

More Telugu News