Prince Philip: తాను స్వయంగా డిజైన్ చేయించుకున్న లాండ్ రోవర్ కారులోనే... శ్మశానానికి ప్రిన్స్ ఫిలిప్ శవపేటిక!

  • 15 సంవత్సరాల క్రితం ప్రిన్స్ అభిరుచుల మేరకు తయారీ
  • గత వారం ప్రిన్స్ ఫిలిప్ అస్తమయం 
  • శనివారం నాడు అంత్యక్రియలు
Prince Philip Coffine will Carried by His Own Designed Car

దాదాపు 15 సంవత్సరాల క్రితం ప్రిన్స్ ఫిలిప్, డ్యూక్ ఆఫ్ ఎడిన్ బర్గ్ స్వయంగా డిజైన్ చేయించుకున్న లాండ్ రోవర్ కారులోనే, ఆయన శవపేటిక శనివారం నాడు విండ్ సర్ క్యాజిల్ లోని శ్మశానానికి తరలనుంది. ఈ విషయాన్ని బకింగ్ హామ్ ప్యాలెస్ వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. గత వారం కన్నుమూసిన ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు ఈ వారాంతంలో జరుగనున్న సంగతి తెలిసిందే.

కాగా, టాటా మోటార్స్ సంస్థ బ్రిటన్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ సంస్థను టేకోవర్ చేయడానికి మూడేళ్ల ముందు... అంటే, 2005లో ప్రిన్స్ ఫిలిప్ ఈ వాహనాన్ని తన అభిరుచుల మేరకు డిజైన్ చేయించుకున్నారు. ఏప్రిల్ 17న  మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన శవపేటికను వాహనంలోకి చేరుస్తారని, ఆపై 8 నిమిషాల తరువాత అది సెయింట్ జార్జ్ చాపెల్ ప్రాంతానికి చేరుతుందని ప్యాలెస్ వర్గాలు ప్రకటించాయి. ఈ వాహనం వెంబడి రాజ కుటుంబీకులు, ఇతర ముఖ్యులు నడుస్తారని తెలిపింది.

More Telugu News