Tamannaah: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Thamanna says there is no differance between films and webs
  • వాటిలో తేడా లేదంటున్న తమన్నా 
  • మహేశ్ సినిమా మ్యూజిక్ పై అప్ డేట్
  • రామ్ తో 'జాతిరత్నాలు' దర్శకుడు
*  తన దృష్టిలో సినిమా, వెబ్ సీరీస్ అనే తేడా లేదని చెబుతోంది కథానాయిక తమన్నా. 'సినిమా అయినా, వెబ్ సీరీస్ అయినా ఏదైనా నటనే. అందుకే నాకు వాటిలో భేదం కనిపించడం లేదు. అలాగే చిన్న సినిమా, పెద్ద సినిమా అని కూడా విభజించను. ఏదైనా మంచి సినిమా అని మాత్రమే ఉంటుంది. అందుకే వేటిలోనైనా నటిస్తాను' అని చెప్పింది. ప్రస్తుతం తను నటించిన 'లెవెన్త్ అవర్' వెబ్ సీరీస్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.  
*  మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారిపాట' చిత్రంలో మొత్తం ఐదు పాటలుంటాయట. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు తమన్ చెబుతూ, ఇప్పటికే మూడు పాటలు రెడీ అయిపోయాయని, పాటలన్నీ మాస్ టచ్ తో ఎనర్జిటిక్ గా వుంటాయని తెలిపాడు. ఇందులో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.
*  ఇటీవల 'జాతిరత్నాలు' చిత్రంతో బాక్సాఫీసు హిట్ కొట్టిన దర్శకుడు అనుదీప్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో హీరో రామ్ తో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి ఈ దర్శకుడు రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన స్టోరీ లైన్ ను కూడా రామ్ ఓకే చేశాడట.
Tamannaah
Mahesh Babu
Keerti Suresh
Ram

More Telugu News