Mahamandaleshwar: 93 ఏళ్ల వయసులో మహామండలేశ్వర్ భారతీ బాపు కన్నుమూత!

Mahamandaleshwar Bharathi Bapu Died on 93
  • వృద్ధాప్య అనారోగ్యంతో మృతి
  • సంతాపం వ్యక్తం చేసిన మోదీ, అమిత్ షా
  • జునాగఢ్ లో అంత్యక్రియలు జరుగుతాయన్న ఆశ్రమ నిర్వాహకులు
గుజరాత్ లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, మహామండలేశ్వర్ భారతీ బాపు నిన్న శివైక్యం పొందారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. అహ్మదాబాద్ లోని సర్కేజ్ ప్రాంతంలో ఉన్న భారతీ ఆశ్రమంలో ఆయన ఇహలోకాన్ని వీడారని ఆశ్రమ నిర్వాహకులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమాల ద్వారా నివాళులు అర్పించారు.

వృద్ధాప్యం కారణంగా వచ్చిన సమస్యలతోనే ఆయన కాలం చేశారని, ఆయన అంత్యక్రియలు ఆశ్రమ ప్రధాన కేంద్రమైన జునాగఢ్ లో జరుగుతాయని ఆశ్రమ నిర్వాహకులు పేర్కొన్నారు. "మహామండలేశ్వర్ విశ్వంభర్ భారతీ జీ, నన్ను ఎంతో ప్రేరేపించి నడిపించారు. లక్షలాది మంది ఆయన అనుచరులకు నా సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి" అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
Mahamandaleshwar
Bharathi Bapu
PassesAway
Narendra Modi
Amit Shah

More Telugu News