ఐపీఎల్: రాణా, త్రిపాఠి దూకుడు... సన్ రైజర్స్ టార్గెట్ 188 రన్స్

11-04-2021 Sun 21:37
  • ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ వర్సెస్ కోల్ కతా
  • మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు
  • రాణా 56 బంతుల్లో 80 పరుగులు
  • అర్ధసెంచరీతో రాణించిన త్రిపాఠి
Nitish Rana and Rahul Tripathi fifties helps KKR to post huge total

చెన్నైలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్ నితీశ్ రాణా 56 బంతుల్లోనే 80 పరుగులు చేయడం విశేషం. రాణా స్కోరులో 9 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. వన్ డౌన్ బ్యాట్స్ మన్ రాహుల్ త్రిపాఠి కూడా దూకుడుగా ఆడడంతో కోల్ కతా స్కోరుబోర్డు పరుగులు తీసింది. త్రిపాఠి 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. చివర్లో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (9 బంతుల్లో 22) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

హైదరాబాద్ బౌలర్లలో మహ్మద్ నబీ 2, రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశారు. భువీ, నటరాజన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

కాగా, లక్ష్యఛేదనకు దిగిన సన్ రైజర్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ వార్నర్ వికెట్ కోల్పోయింది. 3 పరుగులు చేసిన వార్నర్... ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో వెనుదిరిగాడు. అప్పటికి సన్ రైజర్స్ స్కోరు 1.3 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే. ఆ తర్వాత ఓవర్లోనే వృద్ధిమాన్ సాహా కూడా అవుటయ్యాడు. ఈ వికెట్ షకీబల్ హసన్ ఖాతాలో చేరింది.