ఈఎస్ఐ కుంభకోణంలో వెలుగులోకి కొత్త విషయాలు

11-04-2021 Sun 19:35
  • సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కాం
  • నిన్న భారీ ఎత్తున ఈడీ సోదాలు
  • బినామీ పేర్లతో ముకుందారెడ్డి వ్యాపారాలు
  • డొల్ల కంపెనీలతో వైద్య పరికరాల కొనుగోళ్లు
  • ప్రభుత్వం నుంచి అధిక ధరలు వసూలు
More details from esi scam

తెలంగాణలో వెల్లడైన ఈఎస్ఐ కుంభకోణం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ స్కాంకు సంబంధించి నిన్న ఈడీ భారీ ఎత్తున సోదాలు నిర్వహించగా, ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. బినామీ పేర్లతో ముకుందారెడ్డి వ్యాపారాలు చేసినట్టుగా అధికారులు నిర్ధారించారు. ప్రమోద్ రెడ్డి, వినయ్ రెడ్డి పేర్ల మీద ముకుందారెడ్డి వ్యాపారాలు చేసినట్టు గుర్తించారు.

డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా మెడికల్ పరికరాలు కొనుగోలు చేసినట్టు తెలుసుకున్నారు. తక్కువ ధరకు దొరికే వైద్య పరికరాలను కొనుగోలు చేసిన ఈ ముఠా ప్రభుత్వం నుంచి అధిక ధరలు వసూలు చేసినట్టు వెల్లడైంది. ఈ స్కాంలో దేవికారాణి, ముకుందారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరిబాబు భాగస్వాములని అధికారులు స్పష్టం చేశారు.

దేవికారాణి ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు తేల్చారు. పీఎంజే జ్యూయెలరీలో పెద్దఎత్తున కొనుగోళ్లు చేసినట్టు గుర్తించారు. అయితే, ఆస్తులు, నగదు కొనుగోళ్ల కోసం మొత్తం హవాలా మార్గంలోనే చెల్లింపులు చేసినట్టు తేల్చారు.