ఐపీఎల్: కోల్ కతాపై టాస్ గెలిచిన సన్ రైజర్స్

11-04-2021 Sun 19:18
  • ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ వర్సెస్ నైట్ రైడర్స్
  • చెన్నై వేదికగా మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వార్నర్
  • ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి!
  • సన్ రైజర్స్ తుదిజట్టులో రషీద్ ఖాన్, నబీ
  • ఆల్ రౌండర్లతో బలంగా కనిపిస్తున్న నైట్ రైడర్స్
Sunrisers won the toss against Kolkata Knight Riders

ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు టోర్నీలో జరిగిన రెండు మ్యాచ్ లలో ఛేజింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. ఈ నేపథ్యంలో వార్నర్ సేన ఏంచేస్తుందో చూడాలి.

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ రషీద్ ఖాన్, మహ్మద్ నబీ రూపంలో ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతోంది. వార్నర్, బెయిర్ స్టో ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలున్నాయి. బౌలింగ్ లో ప్రధానంగా భువనేశ్వర్ కుమార్ పైనే ఆశలు పెట్టుకుంది.

ఇక కోల్ కతా జట్టు కూడా ఆల్ రౌండర్లతో బలంగా కనిపిస్తోంది. ఆండ్రీ రస్సెల్, షకీబల్ హసన్ లకు తుదిజట్టులో స్థానం కల్పించారు. బౌలింగ్ లో ప్యాట్ కమ్మిన్స్ రాణిస్తే కోల్ కతాకు లాభించనుంది.