తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి హిందువు కాదన్న సునీల్ దేవధర్... తాను హిందువునేనంటూ ఆధారాలు విడుదల చేసిన గురుమూర్తి

11-04-2021 Sun 18:19
  • తిరుపతి బరిలో వాడీవేడి వాతావరణం
  • వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి
  • గురుమూర్తి క్రైస్తవుడంటూ దేవధర్ ఆరోపణలు
  • పూజలు చేసిన ఫొటోలను పంచుకున్న గురుమూర్తి
Sunil Deodhar vs Gurumurthy in Tirupati

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక వ్యవహారం మరింత వేడెక్కింది. వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి హిందువు కాదని, ఒక్కసారి కూడా తిరుమల వెంకన్నను దర్శనం చేసుకోలేదని ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్సీ హిందువుగా తనను తాను చెప్పుకుంటున్న గురుమూర్తి ఓ క్రైస్తవుడని వెల్లడించారు.

అయితే, తాను హిందువునే అంటూ డాక్టర్ గురుమూర్తి ఆధారాలను విడుదల చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకున్నప్పటి వీడియోతో పాటు నామినేషన్ దాఖలు చేసే ముందు గ్రామదేవతకు పూజలు నిర్వహించినప్పటి ఫొటోలను కూడా ఆయన పంచుకున్నారు. పది ఓట్ల కోసం బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని గురుమూర్తి విమర్శించారు.