ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం... సెలవులు ప్రకటించిన అధికారులు

11-04-2021 Sun 15:22
  • ఏపీలో కరోనా విజృంభణ
  • పలు విద్యాసంస్థల్లోనూ కరోనా వ్యాప్తి
  • ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పలువురు విద్యార్థులకు పాజిటివ్
  • పీ-2, ఈ-3 విభాగాల విద్యార్థులకు సెలవులు
  • ఆన్ లైన్ లో క్లాసులు
Corona positive cases in Idupulapaya IIIT

ఏపీలో కరోనా మహమ్మారి శరవేగంగా పాకిపోతోంది. పలు విద్యాసంస్థల్లోనూ వ్యాపిస్తున్న కరోనా వైరస్ తాజాగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోనూ కలకలం రేపింది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పలువురు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. పీ-2, ఈ-3 విభాగాలకు చెందిన విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ రెండు విభాగాలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

వారికి ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తామని ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు. పీ-1. ఈ-4 విభాగాల విద్యార్థులకు మాత్రం క్యాంపస్ లోనే తరగతులు కొనసాగుతాయని వివరించారు. కరోనా సోకిన విద్యార్థులను ఐసోలేషన్ కు తరలించినట్టు పేర్కొన్నారు. దీనిపై ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ, కరోనా వ్యాప్తి కారణంగా పీ-2, ఈ-3 విభాగాలకు సెలవులు ఇస్తున్నామని చెప్పారు.