ఉగాది కానుకగా బాలయ్య-బోయపాటి చిత్రం టైటిల్ ప్రకటన

11-04-2021 Sun 14:12
  • బాలకృష్ణ, బోయపాటి కాంబోలో గతంలో సింహా, లెజెండ్
  • తాజాగా మూడో చిత్రం
  • ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై చిత్రం
  • అప్ డేట్ వెలువరించిన చిత్రబృందం
  • టైటిల్ పై సర్వత్రా ఆసక్తి
  • మే 28న సినిమా రిలీజ్
Balakrishna new movie title will be launched on Ugadi

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్ కు పర్యాయపదంగా మారింది. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ బాక్సాఫీసు వద్ద విజయవంతం అయ్యాయి. ఇప్పుడీ కాంబోలో మూడో చిత్రం (బీబీ3) రూపుదిద్దుకుంటోంది. కాగా ఈ నెల 13న ఉగాది సందర్భంగా ఈ చిత్రం టైటిల్ ప్రకటించనున్నారు. చిత్రబృందం ఇవాళ సోషల్ మీడియాలో ఈ మేరకు అప్ డేట్ ఇచ్చింది. అభిమానుల కోసం ఉగాది కానుకగా బీబీ3 టైటిల్ వెల్లడిస్తామని పేర్కొంది.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం మే 28న రిలీజ్ కానుంది. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. తమన్ బాణీలు అందిస్తున్నాడు. గతంలో బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన చిత్రాల్లో పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బీబీ3 లోనూ పాటలు సక్సెస్ సాధిస్తాయని చిత్రబృందం భావిస్తోంది.