తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైసీపీ ఓడిపోతే మా 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారు: మంత్రి పెద్దిరెడ్డి

11-04-2021 Sun 12:11
  • చంద్రబాబు రెఫరెండం సవాల్‌ను  స్వీకరిస్తున్నాము
  • టీడీపీ అభ్య‌ర్థి ఓడిపోతే ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారా?
  • క‌రోనా వ్యాప్తి కారణంగానే జగన్ తిరుపతి సభ రద్దు
  • పవన్ కల్యాణ్ పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్
peddireddy slams chandrababu naidu

తిరుపతి ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి పెద్దిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ మూడు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉంద‌ని చెప్పారు. ఈ రోజు ఆయ‌న తిరుప‌తిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు రెఫరెండం సవాల్‌ను  స్వీకరిస్తున్న‌ట్లు చెప్పారు. ఒక‌వేళ ఈ ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థి ఓడిపోతే త‌మ‌ 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని ఆయ‌న అన్నారు.

ఒక‌వేళ ఈ ఉప ఎన్నిక‌లో టీడీపీ అభ్య‌ర్థి ఓడిపోతే టీడీపీకి చెందిన‌ ఎంపీలతో పాటు రఘురామరాజుతో రాజీనామా చేయించాల‌ని స‌వాలు విసిరారు. కాగా, తిరుప‌తి ఉప ఎన్నిక‌లో సీఎం జ‌గ‌న్ ప్ర‌చార‌ స‌భ ర‌ద్ద‌యిన విష‌యంపై పెద్దిరెడ్డి స్పందిస్తూ.. క‌రోనా వ్యాప్తి కారణంగానే ఆ సభను రద్దు చేసిన‌ట్లు చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్ గా ఆయ‌న అభివ‌ర్ణించారు.