జగన్ తిరుపతి పర్యటన రద్దుపై అచ్చెన్నాయుడి విమర్శనాస్త్రాలు

11-04-2021 Sun 11:56
  • జగన్‌ది పిరికితనం
  • ప్రమాణం చేయాల్సి వస్తుందనే పర్యటన రద్దు
  • అప్పుడు కరోనా లేదన్న జగన్‌కు ఇప్పుడు అదే అడ్డమైంది
Atchannaidu fires on YS Jagan

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటన రద్దుపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. నిన్నమొన్నటి వరకు కరోనా లేదు, గిరోనా లేదు ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన జగన్.. నేడు అదే కరోనా పేరు చెప్పి తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని, ఇది పిరికితనం కాక మరేంటని ఎద్దేవా చేశారు. జగన్ విచిత్రమైన వ్యక్తి అని, ఆయన రివర్స్‌లో పనిచేస్తారని విమర్శించారు.

వివేకానందరెడ్డి హత్య కేసులో ఎక్కడ ప్రమాణం చేయాల్సి వస్తుందోనన్న భయంతోనే జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని అన్నారు. ఆయన హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ప్రమాణం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అచ్చెన్నాయుడు అన్నారు.