మహారాష్ట్రలో లాక్‌డౌన్ వద్దంటూ ఛత్రపతి శివాజీ వంశస్థుడైన బీజేపీ ఎంపీ భిక్షాటన

11-04-2021 Sun 11:41
  • రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం యోచన
  • వద్దంటూ బీజేపీ ఎంపీ ఉదయన్ భోస్తే భిక్షాటన
  • రూ.450 భిక్షం డబ్బులు జిల్లా అధికారులకు అందజేత
 bjp mp udayanraje bhosale holds sit in to protest against lockdown

మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్ తప్ప వేరే మార్గం లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నిన్న వ్యాఖ్యానించారు. వైరస్‌ను నియంత్రించేందుకు ఇప్పటికే కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండడం, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో లాక్‌డౌన్ విధించక తప్పేలా లేదని సీఎం పేర్కొన్నారు.

లాక్‌డౌన్ విధిస్తే ప్రజలకు కష్టాలు తప్పవని, వ్యాపారులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారని, కాబట్టి లాక్‌డౌన్ ఆలోచనలను మానుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ వంశస్థుడైన బీజేపీ ఎంపీ ఉదయన్ రాజే భోస్లే కూడా లాక్‌డౌన్ వద్దంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.అంతేకాక, పళ్లెం పట్టుకుని రోడ్డు మీద కూర్చుని భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా తనకు వచ్చిన రూ. 450ని జిల్లా అధికారులకు అందిస్తూ లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని కోరారు.