తెలంగాణలో కొత్త‌గా 3,187 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ

11-04-2021 Sun 10:25
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,27,278
  • కోలుకున్న‌వారు  3,05,335 మంది
  • మృతుల సంఖ్య 1,759
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 551 మందికి క‌రోనా  
Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో క‌రోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 3,187 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 787 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,27,278కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,05,335 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,759గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 20,184 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 13,366 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 551 మందికి క‌రోనా సోకింది.