జమ్మూకశ్మీర్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదుల హతం

11-04-2021 Sun 10:07
  • గురువారం నాటి ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు హతం
  • ఉగ్రవాదులు ముగ్గురు అల్‌బగర్ సంస్థకు చెందినవారే
  • కొనసాగుతున్న ఆపరేషన్
3 terrorists dead in an encounter in jammu and kashmir

జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు మరో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. హదీపొరా ప్రాంతంలో అల్‌బగర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్టు సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. భద్రతా దళాలను చూసిన ఉగ్రవాదులు వారిపైకి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు ప్రారంభించాయి.

ఈ క్రమంలో ఇటీవలే ఉగ్రవాద సంస్థలో చేరిన ఓ ఉగ్రవాదిని లొంగిపోవాలంటూ భద్రతా దళాలు విజ్ఞప్తి చేశాయి. అతడి తల్లిదండ్రులను ఘటనా స్థలానికి తీసుకొచ్చి వారితో చెప్పించారు. అయినప్పటికీ అతడు వినిపించుకోలేదు. మిగతా ఉగ్రవాదులు కూడా అతడిని బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని,  ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులు హతమైనట్టు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. కాగా, షోపియాన్‌లో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే.