Tirumala: తిరుమలలో కాబోయే సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణ... ఘన స్వాగతం పలికిన అధికారులు!

NV Ramana in Tirumala for Lord Darshan
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమితులైన ఎన్వీ రమణ, నిన్న సాయంత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనం నిమిత్తం రాగా, అధికారులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి, ఈఓ జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.

ఆపై నిన్న రాత్రి నైవేద్య విరామ సమయంలో ఓ మారు స్వామిని దర్శించుకున్న ఆయన, ఈ ఉదయం మరోమారు స్వామిని దర్శించుకున్నారు. ఆపై ఆలయ పూజారులు ఆయనకు దర్శనం చేయించి, అనంతరం ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం పలికారు.
Go Back to Shorts
Tirumala
Ramana
Tirupati
TTD
Darshan

More Telugu News