ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ల ఫోర్జరీ ఆరోపణలు.. దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు

11-04-2021 Sun 08:16
  • ఈ నెల 7న తిరుపతిలో పర్యటించిన దేవినేని
  • విలేకరుల సమావేశంలో వీడియో ప్రదర్శన
  • అది మార్ఫింగ్ చేసిన వీడియో అంటూ వైసీపీ లీగల్ సెల్ ఫిర్యాదు
CBI Files Case Against Deveneni Uma

తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రదర్శించిన వీడియో ఫోర్జరీదని, దానిని మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తూ వైసీపీ లీగల్ సెల్ చేసిన ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసింది. భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద ఉమపై కేసు నమోదు చేసినట్టు సీఐడీ విభాగాధిపతి పీవీ సునీల్ కుమార్ తెలిపారు.

ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 7న తిరుపతిలో ప్రచారం నిర్వహించిన దేవినేని ఉమ ఆ తర్వాత విలేకరుల సమావేశం నిర్వహించారు. అందులో తిరుపతి రావడానికి ఎవరు ఇష్టపడతారని జగన్ వ్యాఖ్యానించినట్టుగా ఉంది. ఈ వీడియో ఫోర్జరీ చేసినదని, ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజలను పక్కదారి పట్టించాలన్న దురుద్దేశంతోనే మార్ఫింగ్ చేసిన వీడియోను ప్రదర్శించారని ఆరోపిస్తూ వైసీపీ లీగల్ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉమపై సీబీఐ కేసు నమోదు చేసింది.