ఐపీఎల్: ఢిల్లీ ఓపెనర్ల వీరవిహారం... ధావన్, పృథ్వీ షా సెంచరీ భాగస్వామ్యం

10-04-2021 Sat 22:25
  • ఐపీఎల్ లో ఢిల్లీ వర్సెస్ చెన్నై
  • ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 రన్స్
  • విజయం దిశగా ఢిల్లీ క్యాపిటల్స్
Delhi openers smashes Chennai bowling

ముంబయి వాంఖెడే స్టేడియంలో 189 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ జట్టుకు ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరి దూకుడుతో 11 ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 113 పరుగులు చేసింది.. పృథ్వీ షా 57 పరుగులతోనూ, ధావన్ 56 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. ఆ జట్టు గెలుపుకు 54 బంతుల్లో  76 పరుగులు కావాల్సి ఉంది. చేతిలో 10 వికెట్లున్నాయి.

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. సురేశ్ రైనా 54 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మొయిన్ అలీ 36, శామ్ కరన్ రాణించారు. క్రిస్ వోక్స్ కు 2, ఆవేశ్ ఖాన్ కు 2 వికెట్లు లభించాయి.