Elections: పశ్చిమ బెంగాల్ లో ముగిసిన నాలుగో విడత ఎన్నికల పోలింగ్

  • నేడు 44 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
  • సాయంత్రం 6 గంటలకు ముగిసిన పోలింగ్ 
  • సీఐఎస్ఎఫ్ బలగాల కాల్పుల్లో నలుగురి మృతి 
  • ఈసీకి లేఖ రాసిన మమతా బెనర్జీ
  • అమిత్ షాదే బాధ్యత అంటూ ఆరోపణలు
Fourth phase elections Bengal concludes

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు 8 విడతల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో, నేడు నాలుగో విడత ఎన్నికల పోలింగ్ చేపట్టారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఈ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అప్పటివరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.

బెంగాల్ లో నాలుగో విడతలో 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 76.16 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, తొలి విడతలో 84.13 శాతం ఓటింగ్ నమోదు కాగా, రెండో విడతలో 86.11, మూడో విడతలో 84.61 శాతం పోలింగ్ నమోదైంది.

అటు, పశ్చిమ బెంగాల్ లో నాలుగో విడత ఎన్నికల సందర్భంగా హింస చోటుచేసుకుంది. సీఐఎస్ఎఫ్ బలగాల కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో గుర్తు తెలియని వ్యక్తి కాల్పుల్లో ఒకరు మరణించారు. ఈ ఘటనలపై సీఎం మమతా బెనర్జీ ఈసీకి లేఖ రాశారు. రాష్ట్రంలో హింసకు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే బాధ్యుడని ఆరోపించారు.

More Telugu News