సీఎం జగన్ పై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్ల రామయ్య ఫిర్యాదు

10-04-2021 Sat 18:31
  • జగన్, సజ్జలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్న వర్ల
  • తిరుపతి అభ్యర్థి ఆత్మాభిమానం దెబ్బతినేలా పోస్టులు పెట్టారని ఆరోపణ
  • ఇటీవల ఇదే తరహాలో వైసీపీ నేతల ఫిర్యాదు
  • చంద్రబాబు, లోకేశ్ లపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతి
Varla Ramaiah complains on CM Jagan and Sajjala Ramakrishnareddy

టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక అభ్యర్థి ఆత్మాభిమానం దెబ్బతినేలా ఫొటోలు పెట్టారని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఎం జగన్, సజ్జలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఇటీవల వైసీపీ నేతలు ఇదే తరహాలో టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేశ్ లపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. తిరుపతి వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని కించపరిచేలా టీడీపీ అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్టులు పెట్టారని, చంద్రబాబు, లోకేశ్ లపై చర్యలు తీసుకోవాలని వారు డీజీపీని కోరారు.