'ఉగాది'కి డబుల్ ట్రీట్ .. బాలయ్య అఘోరా లుక్!

10-04-2021 Sat 17:47
  • బోయపాటితో బాలయ్య మూడో సినిమా
  • 'గాడ్ ఫాదర్' టైటిల్ ను సెట్ చేసే ఛాన్స్
  • మే 28వ తేదీన విడుదల
Balakrishna latest movie look and title will be released on Ugadi

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న  సినిమాలో, బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ కొంతసేపు అఘోరా గెటప్ లో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో భాగంగా బాలకృష్ణ అఘోరాగా కనిపిస్తాడని చెప్పుకుంటున్నారు. ఈ లుక్ లో బాలయ్య ఎలా ఉంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ లుక్ ను ఇప్పుడు 'ఉగాది' సందర్భంగా రివీల్ చేయనున్నట్టు చెబుతున్నారు.

వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ను సెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. 'ఉగాది' రోజున టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారనే టాక్ వచ్చింది. టైటిల్ పోస్టర్ బాలయ్య అఘోరా లుక్ తో కలిసి ఉంటుందనేది తాజా సమాచారం. అంటే అభిమానులకు ఈ సినిమా టైటిల్ ఏమిటనే విషయం తెలుస్తుంది .. బాలయ్య అఘోరా లుక్ ఎలా ఉంటుందనేది చూస్తారన్న మాట. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, మే 28వ తేదీన విడుదల చేయనున్నారు.