Chiranjeevi: దిల్ రాజు, వేణు శ్రీరామ్ లను స్వయంగా అభినందించిన చిరంజీవి

Chiranjeevi appreciates Dil Raju and Venu Sriram
  • పవన్ ప్రధాన పాత్రలో వకీల్ సాబ్
  • నిన్న విడుదలైన చిత్రం
  • వకీల్ సాబ్ కు బ్లాక్ బస్టర్ టాక్
  • కుటుంబసభ్యులతో కలిసి వకీల్ సాబ్ వీక్షించిన చిరు

వకీల్ సాబ్ చిత్రబృందం విజయోత్సాహంతో ఉప్పొంగిపోతోంది. పవన్ కల్యాణ్ ప్రధానపాత్రలో వచ్చిన వకీల్ సాబ్ నిన్న విడుదల కాగా, అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. పవన్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అంటూ అన్నివర్గాల ఆదరణ పొందుతోంది. కాగా, ఈ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజులను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.

వారిద్దరినీ తన నివాసానికి ఆహ్వానించిన చిరంజీవి వారితో తన ఆనందాన్ని పంచుకున్నారు. వకీల్ సాబ్ చిత్రాన్ని తన తల్లి, ఇతర కుటుంబసభ్యులతో చిరంజీవి నిన్న హైదరాబాదులోని ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్సులో తిలకించడం తెలిసిందే. సినిమాలో పవన్ సహా ప్రతి ఒక్కరి నటన అద్భుతంగా ఉందని ఆయన కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News