Andhra Pradesh: సెకండ్ వేవ్ ఎఫెక్ట్... కర్నూలు జిల్లాలో ఓ పాఠశాలలో కరోనా కలకలం

Corona spreads in a school in Kurnool district
  • ఏపీలో కరోనా రెండో తాకిడి
  • చాగలమర్రిలో కస్తూర్బా పాఠశాలలో 12 మందికి కరోనా
  • పాఠశాలలో మొత్తం 246 మంది విద్యార్థినులు
  • 80 మందికి కరోనా పరీక్షలు
  • కరోనా సోకిన వారికి ఐసోలేషన్
ఏపీలో కరోనా మహమ్మారి మరోసారి జడలు విప్పుకుంది. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ పాఠశాలలో కొవిడ్ కలకలం రేగింది. చాగలమర్రిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలోని 12 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ గురుకుల విద్యాలయంలో 246 మంది విద్యార్థినులు ఉండగా, అనుమానిత  లక్షణాలతో బాధపడుతున్న 80 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

కాగా, కొవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను వైద్య అధికారులు ఐసోలేషన్ కు తరలించారు. పాఠశాల సముదాయంలోనే ఓ గదిలో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో విద్యాసంస్థల్లోనూ కరోనా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తోందన్న అంచనాల నేపథ్యంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.
Andhra Pradesh
Corona Virus
Kasturba School
Kurnool District

More Telugu News