Stock Market: వారాంతాన్ని నష్టాలలో ముగించిన స్టాక్ మార్కెట్లు

  • మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్
  • భయపెడుతున్న కరోనా కేసులు
  • 154.89 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్
stock markets close weekend in red

వరుసగా మూడు సెషన్లలో లాభాలు పొందిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలలో ముగిశాయి. కరోనా సెకండ్ వేవ్ లో దేశంలో పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతుండడం మదుపరుల సెంటిమెంటును దెబ్బకొట్టింది.

దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో మార్కెట్లు ఈ వారాంతాన్ని నష్టాలలో ముగించాయి. పర్యవసానంగా సెన్సెక్స్ 154.89 పాయింట్ల నష్టంతో 49591.32 వద్ద... నిఫ్టీ 38.95 పాయింట్ల నష్టంతో 14834.85 వద్ద క్లోజయ్యాయి.

ఇక నేటి సెషన్లో క్యాడిలా హెల్త్, గ్లెన్ మార్క్, సిప్లా, ఫైజర్, అదానీ ఎంటర్ ప్రైజ్, టెక్ మహేంద్ర వంటి షేర్లు లాభాలు పొందాయి. బజాజ్ ఫైనాన్స్, వేదాంత, టాటా స్టీల్, ఏక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బాల్ కృష్ణ ఇండస్ట్రీస్, ఎమ్మారెఫ్, ఇండస్ ఇండ్  బ్యాంక్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.  

More Telugu News