Sunil Deodhar: పవన్ అంటేనే కాదు ఆయన సినిమాకు కూడా జగన్ భయపడుతున్నారా?: సునీల్ దేవధర్

Sunil Deodhar asks why cancelled Vakeel Saab benefit shows
  • పవన్ ప్రధానపాత్రలో వకీల్ సాబ్
  • నేడు విడుదలైన చిత్రం
  • ఏపీలో బెనిఫిట్ షోలు రద్దు
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు, జనసైనికులు
  • తిరుపతి జయశ్యాం థియేటర్ వద్ద సునీల్ దేవధర్ నిరసన
పవన్ కల్యాణ్ ప్రధానపాత్ర పోషించిన వకీల్ సాబ్ చిత్రం ఇవాళ రిలీజైంది. అయితే ఏపీలో వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు రద్దు చేయడం పట్ల అభిమానులు, జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన భాగస్వామ్య పక్షం బీజేపీ కూడా ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించింది. తిరుపతిలోని జయశ్యాం థియేటర్ వద్ద బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సునీల్ దేవధర్ మాట్లాడుతూ, వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. పవన్ అంటేనే కాదు, ఆయన సినిమా అంటే కూడా జగన్ భయపడుతున్నారా? అని ఎద్దేవా చేశారు. తిరుపతిలో పవన్ కవాతు చేసినప్పుడు అసలు సినిమా రిలీజైందని వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన ట్విట్టర్ లోనూ ఘాటుగా స్పందించారు. ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు వెళ్లి హాజరు వేయించుకునే అలవాటు ఉన్నవాడే కదా వకీల్ సాబ్ ను చూసి భయపడేది? అని వ్యంగ్యం ప్రదర్శించారు.
Sunil Deodhar
Vakeel Saab
Benefit Shows
Jagan
Tirupati
Andhra Pradesh

More Telugu News