నన్ను ఏమీ చేయలేని చంద్రబాబు అకారణంగా నా కొడుకు ఎంపీ మిథున్ రెడ్డిని జైల్లో పెట్టాడు: మంత్రి పెద్దిరెడ్డి

09-04-2021 Fri 14:56
  • చంద్రబాబుపై పెద్దిరెడ్డి విమర్శలు
  • విద్యార్థి దశ నుంచి చంద్రబాబుతో పోరాడుతున్నట్టు వెల్లడి
  • చంద్రబాబు పిరికిపంద అని వ్యాఖ్యలు
  • ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం
AP Minister Peddireddy slams Chandrababu

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గత 4 దశాబ్దాలుగా తాను చంద్రబాబుతో పోరాడుతున్నానని, చంద్రబాబు అంత పిరికిపంద ఈ రాష్ట్రంలో మరొకరు ఉండరని అన్నారు. విద్యార్థి దశ నుంచి చంద్రబాబుతో తన పోరాటం కొనసాగుతోందని, నీతిమాలినతనానికి ప్రతీక చంద్రబాబు అని విమర్శించారు.

"చంద్రబాబు నన్ను ఏమీ చేయలేక గతంలో నా కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని అకారణంగా జైలు పాలు చేశాడు" అని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు కనీసం ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను కూడా నియమించుకోలేని దుస్థితికి దిగజారిపోయాడని వ్యాఖ్యానించారు.