నా సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆల్‌ది బెస్ట్!: ర‌త్న‌ప్ర‌భ‌

09-04-2021 Fri 11:59
  • 'వకీల్ సాబ్' ఈరోజు థియేటర్లలో విడుదల‌
  • సినిమా హిట్ అవుతుంద‌న్న ర‌త్న‌ప్ర‌భ‌
  • థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల సంద‌డి
ratna prabha tells all the best to pawan

మూడేళ్ల తర్వాత  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' ఈరోజు థియేటర్లలో విడుదలైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఈ సినిమా సూప‌ర్ హిట్ కావాల‌ని కోరుకుంటున్నారు. దీనిపై తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక బీజేపీ-జ‌న‌సేన అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ కూడా స్పందించ‌డం గ‌మనార్హం.

'నా సోద‌రుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నాను. ఈ సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం నాకుంది' అని ఆమె ట్వీట్ చేశారు. కాగా, వ‌కీల్ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.  కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ప‌లు ప్రాంతాల్లో రోడ్ల‌పైనే టపాసులు కాల్చుతున్నారు. బాలీవుడ్‌లో హిట్ కొట్టిన 'పింక్'కు రీమేక్ గా 'వకీల్ సాబ్' రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వ‌హించారు. ఇందులో శ్రుతి హాసన్, అంజలి, నివేదా థామస్, అనన్య, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో న‌టించారు. తమన్ అందించిన స్వ‌రాలు అల‌రిస్తున్నాయి.