ఎండలు ముదిరే కొద్దీ చిట్టి నాయుడి చిత్త భ్రమ పీక్స్ కు పోతున్నది: విజ‌య‌సాయిరెడ్డి సెటైర్

09-04-2021 Fri 11:46
  • ఇంకా అధికారంలోనే ఉన్నట్లు భ్రమపడుతున్నాడు
  • వృద్ధాప్య పెన్షన్ పెంచేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నాడు
  • ఆయిల్ రేట్లు తగ్గిస్తానని మొన్న కామెడీ
  • దాని నుంచి జనం తేరుకోకముందే ఇంకో బాంబు పేల్చాడు
vijay sai reddy slams tdp

టీడీపీ యువ‌నేత నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీల్లో ఆయ‌న చేస్తోన్న వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ఎద్దేవా చేశారు.

'ఎండలు ముదిరే కొద్దీ చిట్టి నాయుడి చిత్త భ్రమ పీక్స్ కు పోతున్నది. ఇంకా అధికారంలోనే ఉన్నట్లు భ్రమపడుతున్నాడు. వృద్ధాప్య పెన్షన్ పెంచేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నాడు. ఆయిల్ రేట్లు తగ్గిస్తానని మొన్న చేసిన కామెడీ నుంచి జనం తేరుకోకముందే ఇంకో బాంబు పేల్చాడు!' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

అలాగే, బీజేపీ నేత‌లు సునీల్ దేవ్‌ధ‌ర్, సుజ‌నా చౌద‌రిపై కూడా విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. 'సునీల్‌ దేవ్‌ధర్‌కి బీజేపీ కాదు... సుజనా చౌదరే హైకమాండ్! ఎందుకని మాత్రం నన్ను అడగకండి! వీరిద్దరినీ ఇక సునీల్ చౌదరి, సుజనా దేవ్‌ధర్‌ అని పిలుద్దాం!' అని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.