'వకీల్ సాబ్'లో అవే హైలైట్ అంటున్న ఫ్యాన్స్!

09-04-2021 Fri 11:24
  • ఈ రోజునే 'వకీల్ సాబ్' రిలీజ్
  • థియేటర్ల దగ్గర అభిమానుల సందడి
  • ఇంట్రడక్షన్ సీన్ అదిరిందంటున్న ఫ్యాన్స్  
Vaakeel Saab has more highlight sceans

పవన్ కల్యాణ్ - వేణు శ్రీరామ్ కాంబినేషన్లో రూపొందిన 'వకీల్ సాబ్' సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. 'దిల్'రాజు నిర్మించిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు.

 చాలా గ్యాప్ తరువాత పవన్ చేసిన సినిమా కావడంతో, ఆయన అభిమానులంతా ఈ రోజు కోసం ఎదురుచూస్తూ వచ్చారు. వాళ్లలో ఆ సంతోషం .. సంబరం థియేటర్ల దగ్గర కనిపిస్తోంది. టీజర్ .. ట్రైలర్ .. సాంగ్స్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతూ వచ్చాయి. దాంతో పవన్ అభిమానులంతా మొదటి రోజునే ఈ సినిమాను చూడటానికి పోటీ పడ్డారు.

ఈ సినిమా చూసిన పవన్ ఫ్యాన్స్ ఇందులో కొన్ని హైలైట్స్ గురించి ప్రస్తావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగుంది .. కథ ప్రకారం ఆయన ఓ పావుగంట తరువాత ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆయన ఎంట్రీని డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉందని చెబుతున్నారు.

సెకాండాఫ్ లో వచ్చే కోర్టు సీన్లో పవన్ - ప్రకాశ్ రాజ్ మధ్య వాదోపవాదాలు నడిచే సీన్ క్లాప్స్ కొట్టిస్తుందని అంటున్నారు. ఈ సీన్లో డైలాగ్స్ చెప్పుకోదగినవిగా ఉన్నాయని చెబుతున్నారు. ఇక మెట్రో ట్రైన్ లోని ఫైట్ ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిందనే అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు.