ప్రమాణ స్వీకారం చేయకుండానే కన్నుమూసిన గుంటూరు వైసీపీ కార్పొరేటర్

09-04-2021 Fri 11:13
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకి పరిస్థితి విషమం
  • అనారోగ్యం కారణంగా ప్రమాణస్వీకారానికీ దూరం
Guntur YSRCP Corporator died due to ill health

ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా విజయం సాధించిన గుంటూరు వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేశ్ గాంధీ నిన్న మృతి చెందారు. అయితే అనారోగ్యం కారణంగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేకపోయారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తొలుత కోలుకున్నట్టే కనిపించారు.

అయితే, ఆ తర్వాత ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో పరిస్థితి విషమించి కన్నుమూశారు. నిజానికి ఆయన రెండున్నరేళ్లపాటు మేయర్‌గా పనిచేయాల్సి ఉన్నప్పటికీ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే ఆయన తుదిశ్వాస విడిచారు. రమేశ్ గాంధీ మృతి విషయం తెలిసి వైసీపీ నేతలు సంతాపం తెలిపారు.