తప్పు ఎప్పుడూ ఒక్కరివైపే ఉండదు.. క్యాస్టింగ్ కౌచ్‌పై సీనియర్ సినీ నటి అన్నపూర్ణ

09-04-2021 Fri 09:47
  • ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు రెండువైపులా ఆలోచించాలి
  • క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడం వేస్ట్
  • ప్రతి రంగంలోనూ మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
Tollywood Senior Actress Annapurna about Casting Couch

నిన్నమొన్నటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమను కుదిపేసిన క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ తాజాగా స్పందించారు. ప్రస్తుతం ‘ఎఫ్3’ సినిమాలో నటిస్తున్న ఆమె క్యాస్టింగ్ కౌచ్‌పై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తప్పు ఎప్పుడూ ఒకరివైపే ఉండదని, కొన్నిసార్లు ఇద్దరి అంగీకారంతోనే తప్పులు జరుగుతుంటాయని చెప్పారు.

ఏ రంగంలో ఉన్నా మహిళలకు ఇలాంటివి తప్పవన్నారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడం అనవసరమని కొట్టిపడేశారు. క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చినప్పుడు రెండు వైపుల నుంచి ఆలోచించాలని అన్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటివి ఎదుర్కొంటే వెంటనే వాటిని బయటపెట్టాలని సూచించారు. తప్పులు జరగబోవని తాను చెప్పడం లేదని, కొన్నిసార్లు ఇద్దరికీ ఇష్టమైతేనే జరుగుతాయని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. ఇలాంటివి ఎదురైనప్పుడు మహిళలు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.