వకీల్‌సాబ్ బెనిఫిట్‌ షోలను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం.. నిడదవోలులో పవన్ అభిమానుల ఆందోళన

09-04-2021 Fri 09:24
  • నేడు విడుదలవుతున్న ‘వకీల్‌సాబ్’  
  • నిడదవోలు ఎమ్మెల్యే ఇంటి వద్ద ఫ్యాన్స్ ఆందోళన 
  • చెదరగొట్టిన పోలీసులు
Pawan Fans protest in Nidadavolu

పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వకీల్‌సాబ్’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్లను కూడా విక్రయించారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ఈ సినిమా బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, టికెట్ల ధరలు పెంచడం కూడా కుదరదని తేల్చి చెప్పింది.

అయితే, ఇప్పటికే పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో బెనిఫిట్ షో టికెట్లు కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో బెనిఫిట్ షోలు రద్దు కావడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అభిమానులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.