వాళ్లను జైల్లో పెట్టి కుమ్మేయాలి: మంచు విష్ణు

09-04-2021 Fri 07:57
  • రంగంపేటలో ఓటేసేందుకు వచ్చిన విష్ణు
  • ఓటర్లు లేకపోవడంతో ఆశ్చర్యం
  • వృద్ధులను చూసి స్ఫూర్తి తెచ్చుకోవాలన్న విష్ణు
Manchu Vishnu Says Voters Who vote for Cash should be Jailed

ఎవరైనా ఓటు వేసేందుకు డబ్బులు అడిగితే, వారిని జైల్లో పెట్టి, నాలుగు కుమ్మాలని నటుడు మంచు విష్ణు కీలకల వ్యాఖ్యలు చేశారు. నిన్న ఏపీలో పరిషత్ ఎన్నికలు జరుగగా, చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, రంగంపేట ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటేసేందుకు వచ్చిన విష్ణు, అక్కడి పరిస్థితిని చూసి అవాక్కయ్యాడు. ఓటు వేసేందుకు అక్కడ ఎవరూ లేకపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయిన విష్ణు, ఎందుకు ఓటర్లు లేరని అక్కడి అధికారులను ప్రశ్నించారు.

ఓటింగ్ చాలా మందకొడిగా సాగుతోందని అక్కడి వారు చెప్పిన మాటలు విని ఆగ్రహానికి గురయ్యారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కని, ఓపక్క వృద్ధులు ఓటేసేందుకు వస్తుంటే, యువతీ యువకులు ఇంటి నుంచి కదలకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ వృద్ధులను స్ఫూర్తిగా తీసుకుని ఓటేయాలని పిలుపునిచ్చారు.