రెండో శతాబ్దంలో.. శాతవాహనులతో పూజలందుకున్న గణేశుని విగ్రహం ఇది!

09-04-2021 Fri 06:53
  • అనంతపురం జిల్లాలో తవ్వకాలు జరుపుతుండగా వెలుగులోకి
  • వ్యవసాయ భూముల్లో లభించిన విగ్రహం
  • మ్యూజియంలో ఉంచుతామన్న మాజీ మంత్రి
Ganesh Idol from Shatavahana Dynasty

అనంతపురం జిల్లాలో రెండవ శతాబ్దంలో శాతవాహనులతో పూజలందుకున్న అరుదైన వినాయకుని ప్రతిమ బయటపడింది. జిల్లాలోని మడకశిర మండలం, నీలకంఠాపురంలో తవ్వకాలు జరుగుతుండగా విగ్రహం వెలుగులోకి వచ్చింది.

కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో వ్యవసాయ భూముల్లో గత కొంతకాలంగా అన్వేషణ జరుగుతుండగా, ఈ విగ్రహం కనిపించిందని అధికారులు తెలిపారు. పొట్ట, ఎడమవైపు తిరిగినట్టుగా ఉన్న తొండం, పగిలిన కాళ్లు, చేతులు, చెవులు విగ్రహానికి ఉన్నాయని వెల్లడించారు.

ఈ శిల్పకళను పరిశీలించిన అనంతరం ఇది క్రీస్తు శకం, రెండో శతాబ్దానిదని గుర్తించామన్నారు. ఈ విగ్రహాన్ని ఆలయం వద్ద ఏర్పాటు చేయనున్న మ్యూజియంలో ఉంచుతామని మాజీ మంత్రి రఘువీరారెడ్డి వెల్లడించారు.