తిరుపతి పార్లమెంటు స్థానం పరిధిలోని కుటుంబాలకు సీఎం జగన్ లేఖ

08-04-2021 Thu 20:56
  • ఈ నెల 17న తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక
  • ముమ్మరంగా ప్రచారం
  • తమ పాలన గురించి లేఖలో ప్రస్తావించిన సీఎం జగన్
  • పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివరణ
  • ఈ నెల 14న సీఎం జగన్ తిరుపతి రాక
CM Jagan wrote Tirupati Parliament constituency voters family

తిరుపతి పార్లమెంటు స్థానానికి ఈ నెల 17న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో, వైసీపీ అభ్యర్థికే ఓటేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు తిరుపతి లోక్ సభ స్థానం పరిధిలోని ఓటర్ల కుటుంబాలకు లేఖ రాశారు.

తన లేఖలో విపక్షాలపై విమర్శల జోలికి వెళ్లని సీఎం జగన్... కేవలం తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధినే విమర్శించారు. ఈ 22 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలోని కుటుంబాలకు తమ పథకాలను ఏ విధంగా అందిస్తున్నదీ విశదీకరించారు. కాగా, సీఎం జగన్ ఈ నెల 14న తిరుపతి రానున్నారు. రేణిగుంట మండలం యోగానంద కాలేజి సమీపంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.