మద్యం దుకాణాలు కరోనా కేంద్రాలుగా మారాయి: తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
- ఆర్టీపీసీఆర్ పరీక్షలను 70 శాతం పెంచండి
- ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలను నిర్వహించండి
- కరోనా కట్టడికి నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయండి
రాష్ట్రంలోని మద్యం దుకాణాలు కరోనా కేంద్రాలుగా మారాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా కరోనా పరీక్షలను నిర్వహించాలని సూచించింది. కరోనా కట్టడికి నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, కరోనా నిబంధనలను ఉల్లంఘించిన ఘటనల్లో 22 వేల కేసులు నమోదు చేసినట్టు నివేదికలో డీజీపీ పేర్కొన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించని వారిపై 2,416 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.