అలాగైతే.. కేవలం వైసీపీ గుర్తును మాత్రమే వేసి బ్యాలెట్ పత్రాలు ఇవ్వాల్సింది: నాదెండ్ల మనోహర్
- తమకు ఎదురు నిలబడకూడదనేదే వైసీపీ వాళ్ల ధోరణి
- తప్పుల తడకగా ఎన్నికల ప్రక్రియ
- గున్నేపల్లిలో జనసేన గుర్తు లేకుండా బ్యాలెట్ పత్రాలు
- అధికార పక్షానికే వత్తాసు పలుకుతారా?
దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తప్పుల తడకగా నిర్వహిస్తోందని ఆయన విమర్శించారు. గున్నేపల్లిలో జనసేన గుర్తు లేకుండా బ్యాలెట్ పత్రాలు ఇచ్చారని ఆరోపించారు. అధికార పక్షానికే వత్తాసు పలకాలని అనుకుంటే కేవలం వైసీపీ గుర్తును మాత్రమే వేసి బ్యాలెట్ పత్రాలు ఇవ్వాల్సిందని వ్యంగ్యంగా అన్నారు.